తెలంగాణ

నల్లమల అటవీ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఐటీడీఏ ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 8: నల్లమల అటవీ ప్రాంతంలో రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గత రెండు నెలల నుండి నల్లమల అటవీ ప్రాంతంలో పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలలతో ఆదివాసీ చెంచుపెంటల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మార్చి నాటికి భూగర్భ జలాలు మరింత పడిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనులు ఈ ప్రాంతాల్లో ఇంకా పూర్తి కాకపోవడం మరో ఆరు నెలల తర్వాతే పలు గ్రామాలకు శుద్దజలాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే బాధ్యత సంబంధిత అధికారులుపై ఉండడంతో తరుచూ అధికారులు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అయితే వచ్చే వేసవీ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, పదర, లింగాల, అచ్చంపేట మండలాల పరిధిలోని పలు చెంచుపెంటల్లో మంచినీటి ఎద్దడి రాకుండా ప్రజలతో కలిసి ఐటీడీఏ అధికారులు మాత్రం గిరిజన ధర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్, బైరాపూర్, మెడిమల్కల, రాంపురంపెంట, ఈర్లపెంట, తంగిండిగుండాల, పరహాబాద్, తార్లపల్లి, కుడిచింతలబైలు, వటవర్లపల్లి, కంన్నకుంట, పల్లెరూట్‌పెంట గ్రామాల్లో రోజురోజుకు భూగర్భ జలాలు పండిపోతున్నాయి. మరో 20 లోతట్టు ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గత వారానికి పోలిస్తే ఏకంగా దాదాపు పదిమీటర్ల లోతుగా భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తుంది. దాంతో పలు చెంచుపెంటల్లో అక్కడి ప్రజలు సహజమైన నీటిని కూడా వాడుకుంటారు. చెలిమెల ద్వారా వచ్చే నీటితో తమ దాహార్తిని తీర్చుకోనున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చెలిమెలు కూడా ఎండిపోయే ప్రమాదం ఉండడంతో ఐటీడీఏ అధికారులు ప్రత్యేకంగా చెంచుపెంటలపై దృష్టి సారించారు. అలాంటి చెంచుపెంటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడానికి ప్రణాళికలు రూపొందించిన్నట్లు సమాచారం. నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన తండాలు, చెంచుపెంటలు, పలు గ్రామాలలో నీటి ఎద్దడిని రాకుండా గిరిజన ధర్బార్ల పేరిట గత నాలుగైదు రోజుల నుండి ఐటీడీఏ అధికారులు సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో నీటి విలువ గురించి తెలియజేస్తూ నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ఇటీవల నూతనంగా ఎన్నికైనా సర్పంచ్‌లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతుండడంతో తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనేనని అధికారులతో తరుచూ బేటీ అవుతున్నారు.
సమస్య రాకుండా చూస్తాం: ప్రాజెక్టు అధికారి
నల్లమల అటవీ ప్రాంతంలో మంచినీటి సమస్య రాకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నామని నల్లమల అటవీ ప్రాంతంలోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటయ్య తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో పడిపోతున్న భూగర్భ జలాలపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటయ్యతో ఆంధ్రభూమి ప్రతినిధి పోన్‌లో ఆరా తీయగా వచ్చే వేసవీ కాలన్ని దృష్టిలో ఉంచుకుని చెంచుపెంటల్లో, గిరిజన అవాసాల్లో ముందస్తు చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. భూగర్భ జలాలు పడిపోపోతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడానికి చర్యలు తీసుకోబోతున్నామని ఆయన వెల్లడించారు. బైరాపూర్ ఉత్సవాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గిరిజన ధర్బార్ పేరిట ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేశామని ప్రజల నుండి వినతులు కూడా తీసుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.