తెలంగాణ

ప్రజాభీష్టం మేరకే జిల్లాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 10: పరిపాలన ప్రజలకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో జిల్లాల పునర్వీభజన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అయితే ప్రజలు ఏలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావద్దని, ప్రజా అంగీకారం మేరకే జిల్లాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. 70 కిలోమీటర్ల పరిధిలో 20 నుంచి 22 మండలాలను ఒక జిల్లాను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాల ఏర్పాటుతోపాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు సపరిపాలన అందించాలనే ఉద్దేశంతో జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 60 వేల జనాభా కలిగిన మండలాన్ని విడగొట్టి అర్బన్, రూరల్ మండలాలుగా చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రజలకు ఇష్టం లేకుండా కొత్త జిల్లాల్లో ఏ మండలాన్ని కలపబోమన్నారు. మండలాల విలీనంపై మొదట గ్రామాల్లో, అనంతరం మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని తెలిపారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయబోమని, ప్రజల విల్లింగ్ లేకుండా విలీనం చేసే ప్రసక్తే లేదని అన్నారు. కొంతమంది వ్యక్తులు అనవసరపు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. శాస్ర్తియంగా జిల్లాల పునర్వీభజన ఉంటుందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్‌తోపాటు జగిత్యాల జిల్లాలకు లైన్ క్లీయర్ కాగా, సిరిసిల్ల జిల్లాపై సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కొన్ని మండలాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిరిసిల్లకు సమీపంలోని మండలాలను మాత్రమే విలీనం చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాలు వరంగల్ జిల్లాలో, మహదేవ్‌పూర్, కాటారం, మహముత్తారం, మల్హర్ మండలాలతో కొత్తగా భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల