తెలంగాణ

పాత్రికేయ వృత్తి విలువలు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఉంటూ, అభివృద్ధి వార్తలు, పరోశధనాత్మక వార్తల ద్వారా పాత్రికేయ వృత్తి విలువలు పెంచాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) అధ్వర్యంలో శుక్రవారం పాత్రికేయులకు నిర్వహించిన ‘వార్తాలాప్’ అవగాహన కార్యక్రమంలో అల్లం నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం డిజిటల్ రంగం కేంద్రంగా మీడియా విస్తృతి పెరిగిందని, సాంప్రదాయ పద్ధతిలో వార్తలు రావడం తగ్గిపోయిందని అన్నారు. సమాచార వ్యవస్థ నేరుగా ముందుకు సాగుతున్నదని, అందుకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వానికి, మీడియాకు మధ్య వారధిగా పత్రికా సమాచారం కార్యాలయం పని చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాల గురించి వార్తలు రాస్తే అది ప్రభుత్వానికి అనుకూలమని భావించరాదని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన తెలిపారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వార్తలు వస్తున్నాయని, వాటి నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేటు మీడియా సంస్థలు స్పష్టతనిచ్చే విధంగా పని చేయాలని అల్లం నారాయణ సూచించారు.
సమాజ హితానికి కలం శక్తి: బుద్దా మురళి పిలుపు
సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ బుద్దా మురళి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సామాన్యుడి కోసం పని చేయాలని అన్నారు. ముఖ్యంగా పాత్రికేయులు తమ కలం శక్తిని సమాజహితానికి ఉపయోగించాలని, సత్యశోధనే పరమావధి కావాలని ఆయన సూచించారు. సమాజంలో అవకాశాలు లభించని ఎందరో అర్హులైన ప్రతిభావంతులు ఉన్నారని, వారిని ప్రపంచానికి పరిచయం చేసే శక్తి కేవలం పాత్రికేయులకే ఉందన్నారు. సంచలన వార్తలకే కాకుండా అభివృద్ధికి సంబంధించిన వార్తలకూ ప్రాముఖ్యతనివ్వాలని ఆయన తెలిపారు.
సంచలనానికి ప్రాధాన్యం: కమిషనర్ మహేష్ భగవత్
రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ప్రసంగిస్తూ నేరం చేసిన వారికి ప్రచారం ఎక్కువగా లభిస్తున్నదని అన్నారు. మీడియా సంచలనాత్మక వార్తలే అధిక ప్రాధాన్యతనిస్తున్నదని ఆయన తెలిపారు. నేరానికి సంబంధించిన వార్తలు పదేపదే చూపించడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అవుతాయని అన్నారు. కొంత మంది నేరస్తులు యూ-ట్యూబ్‌లో చూసి నేర్చుకున్నామని విచారణలో చెప్పారని ఆయన తెలిపారు. వార్తలు రాసేప్పుడు బాధితుల తరఫున కూడా ఆలోచించాలని ఆయన కోరారు. ఐపీఎస్ అధికారి బి. సుమతి ప్రసంగిస్తూ మహిళలు, పిల్లలకు సంబంధించిన వార్తలు రాసేప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని, కొన్ని పత్రికలు, ఛానళ్ళు బాధితులను లక్ష్యంగా చేసుకున్నట్లు చూపించడం సమంజసం కాదన్నారు.
ఆత్మవంచన-పరవంచన: దిలీప్
సాక్షి దిన పత్రిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి ప్రసంగిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న అబద్దపు వార్తలను అరికట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఫేక్ మీడియా బాగా పెరిగిందని, ఆత్మవంచన-పరవంచనతో మీడియా విశ్వసనీయత దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
మీడియా విశ్వసనీయత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పాత్రికేయు ఉడుముల సుధాకర్ రెడ్డి ప్రసంగిస్తూ సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలపై ఎలా అప్రమత్తంగా ఉండాలో చెప్పారు. ఇంకా సీనియర్ పాత్రికేయులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే. నాగేశ్వర్, నల్సార్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి కుమార్ ప్రసంగించారు. పీఐబీ ప్రాంతీయ అదనపు డైరెక్టర్ టీవీకే రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ అతిథులకు స్వాగతం పలికారు.