తెలంగాణ

రక్షణ శాఖలో ప్రధాని ప్రమేయం తప్పు: మల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రక్షణ శాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయం ఉండరాదని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని కార్యాలయం ప్రమేయం ఉందని రక్షణ శాఖ లేఖ రాసిందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆ లేఖను తాము పట్టడం లేదు కానీ అధికారులు అతిగా స్పందిస్తున్నారని ఆయన చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల ప్రక్రియను లోగడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. అయితే హెచ్‌ఏఎల్‌కు కాకుండా అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి లాభం చేకూర్చేలా ప్రయత్నం జరిగిందన్నదే తమ పార్టీ ఆరోపణ అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. రాజకీయం చేయడం బీజేపీకి మాత్రమే పేటెంట్ హక్కుగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయం చేయడం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకోవాలని మల్లు రవి సూచించారు.