తెలంగాణ

ఐఆర్ ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) కాలపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచినందువల్ల వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ని ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) డిమాండ్ చేసింది. టీఈఏ అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమార స్వామి అధ్యక్షతన 18 వ రాష్ట్ర మహాసభ శనివారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా వేర్వేరు తీర్మానాలు చేశామని సంపత్ తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని తీర్మానించామన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే వెనక్కు తీసుకురావాలని కోరారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్లస్థలం ఇవ్వాలని కోరారు. టీఈఏకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరారు.