తెలంగాణ

పుష్కర ఘాట్ల పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 10: ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా కృష్ణా పుష్కర ఘాట్ల పనులకు శ్రీకారం చుట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏకంగా 32 ఘాట్లను ఏర్పాటు చేశారు. మరో 20 ఘాట్లను లోకల్ ఘాట్లుగా గుర్తించారు. ప్రధానంగా కృష్ణానది ఇరువైపుల ప్రధాన పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ పర్యాటక ప్రదేశాలలో గుర్తించి 32 పుష్కర ఘాట్లను మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ స్థలాలతో పాటు దేవాలయాల అభివృద్ధికి ఘాట్ల నిర్మాణాలకై ప్రభుత్వం రూ.270 కోట్లతో పనులను మొదలుపెట్టారు. కేవలం 32 ఘాట్ల మరమ్మతులు, నిర్మాణాలకు ప్రభుత్వం రూ.84.75 కోట్ల నిధులను విడుదల చేసి, వాటి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడుతున్నారు. అదేవిధంగా పుష్కర ఘాట్లకు వెళ్లే పంచాయతీ, ఆర్‌అండ్‌బి రోడ్ల మరమ్మతుల కోసం రూ.64.26 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రోడ్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ పరిధిలో జరిగే 115 పనులకు గాను రూ.19.74 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఆర్‌అండ్‌బి పరిధిలోని పలు పనులకు రూ.99 కోట్లు కేటాయించగా దేవాదాయశాఖ పరిధిలో దేవాలయాల అభివృద్ధికి రూ.2.46 కోట్ల నిదులను మంజూరు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా పుష్కరాల పనులకై రూ.270.21 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. నిధులు కేటాయించడంతో ముందుగా పుష్కరఘాట్ల పనులపై ప్రత్యేక అధికారులు దృష్టి కేంద్రీకరించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది తీరాన 32 ఘాట్ల పనులు జోరుగా కొనసాగుతుండడంతో పుష్కర శోభ అప్పుడే మొదలైనట్లు కనబడుతోంది. జిల్లాలోని కృష్ణానది తీరాన పెబ్బేర్ మండలం రంగాపురం, రామాపురం, మునగమానిదేవి, గుమ్మడం, ఇటిక్యాల మండలం బీచుపల్లి, ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు నందిమల్ల, జూరాల, మూలమళ్ల, ధరూర్ మండలంలో పెద్దచింతరేవుల, రేవులపల్లి, నెట్టెంపాడు, ఉపెర్ దగ్గర పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. గద్వాల మండలంలోని నంది అగ్రహారం, బీరేల్లి, రేకులంపల్లి, మక్తల్ మండలంలోని పస్పుల, పంచదేవులపాడ్, పరేవుల మాగనూర్ మండలంలో కృష్ణా రైల్వే బ్రిడ్జి, తంగడి, కొల్లాపూర్‌లో సోమశిల, మంచాలకట్ట, పాతాళగంగా, మల్లేశ్వరం, ఆమరగిరిలలో పుష్కర ఘాట్లను గుర్తించి వాటి పనులను మొదలుపెట్టారు.
వీపనగండ్ల మండలంలో జటర్‌పోల్, చెల్లపాడు, పెద్దమారూరు, అలంపూర్ మండలంలోని కృష్ణానది తీరాన గొందిమల్ల, క్యాతూర్‌లలో ఘాట్లను ఇప్పటివరకు అధికారికంగా గుర్తించారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలోని పుష్కరాలకు సంబంధించిన పనులకు దాదాపు రూ.270 కోట్ల నిధులను కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి.

మహబూబ్‌నగర్ జిల్లా రంగాపూర్ గ్రామం వద్ద పుష్కర ఘాట్ల నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కూలీలు