తెలంగాణ

శేరితండాను అందరూ మెచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 12: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అధికంగా గిరిజన తండాల్లో ఎప్పుడూ సమస్యలు వెక్కిరిస్తూనే ఉంటాయి. తక్కువ కుటుంబాలతో వెలసిన గిరిజన తండాలన్నీ పక్కన ఉన్న ఏదో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉండటంతో ఆ తండాలకు గ్రామ స్వరాజ్యం సిద్ధించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమాని 500 జనాభా కలిగిన తండాలు, గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం, ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగియడంతో నూతన పాలక వర్గాలు అభివృద్ధి బాట పట్టాయి.
నారాయణఖేడ్ మండలంలోని శేరి తండాలో వంద శాతం మహిళలతోనే పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ఇతర అధికారులను వెంటబెట్టుకుని శేరి తండాను సందర్శించారు. కలెక్టర్, యంత్రాంగం తండాకు తరలివస్తున్నట్లు తెలియడంతో గిరిపుత్రుల్లో పట్టరాని ఆనందం ఏర్పడింది. కలెక్టర్ బృందానికి ఎదురెళ్లిన తండావాసులు ఘన స్వాగతం పలికారు. నుదుట తిలకం దిద్ది, మంగళనీరాజనం చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వందశాతం గిరిజన మహిళల పాలక మండలికి సన్మానం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన శేరి తండాను అభివృద్ధి చేసుకుని రాష్టమ్రే శభాష్ అనాలని సూచించారు. ఇందులో యువత, మహిళలు అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు అధికారులు తరచుగా వస్తుంటారని సహకరించాలని కోరారు. యువత, మహిళలు వచ్చే ఆదివారం నుండి శ్రమదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ఆయా శాఖల పరిధిలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు శేరి తండాకు అందించడానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ శేరి తండాను దత్తత తీసుకోవడంతో మహర్దశ ఖాయమని చెప్పవచ్చు.

చిత్రం.. నారాయణఖేడ్ మండలం శేరి తండాలో కలెక్టర్‌ను ఊరేగింపుతో తీసుకువెళుతున్న గిరిజనులు