తెలంగాణ

క్రాప్ట్ విలేజ్ అకాడమీలో.. సంస్కృతి ప్రతిబింబించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో సీఐఐ అధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఇంటర్నేషనల్ క్రాప్ట్ విలేజ్ అకాడమీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళలు, హస్తకళా వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సీఐఐ ప్రతినిధులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో బుర్రా వెంకటేశంతో సీఐఐ మాజీ చైర్మన్ వనిత దాట్ల సమావేశమ్యారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ హైదరాబాద్ గ్లోబల్ సిటీపై సీఐఐ అధ్వర్యంలో జియోగ్రాఫికల్ ఇంటెలెక్చువల్ ట్యాగ్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని వనిత చేసిన విజ్ఞప్తికి వెంకటేశం సానుకూలంగా స్పందించారు. సీఐఐ భాగస్వామ్యంలో హైదరాబాద్ ఫెస్టివల్‌తో పాటు మేజర్ ఫెస్టివల్స్‌ను నిర్వహించాలన్న అంశాలపై వారు ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఐఐ ప్రతినిధులు అనురాగ్ శర్మ, శుభోదిత్ సహాలు పాల్గొన్నారు.