తెలంగాణ

‘సంచార జాతులను బిచ్చగాళ్లని అనొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: అత్యంత వెనుకబడిన 32 సంచార, అర సంచార జాతుల వారి కోసం మొదటిసారిగా ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినందుకు కవి, పరిశోధకుడు జయధీర్ తిరుమలరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించారు. వెనుకబడిన కులాల వారి కన్నా అత్యంత దయనీయమైన జీవితాన్ని గడిపే సంచార జాతుల అభ్యున్నతి కోసం ఇలాంటి కృషి ఏనాడో జరిగి ఉండాల్సిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా వారి సంక్షేమం, అభివృద్ధి కోసం సంస్థ ఏర్పాటు నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే అందుకు కావాల్సిన నిధులను సమకూర్చి వెనువెంటనే చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో (ఎంఎస్ నెం. 17, జూన్ 8న)లో దాసరులను నేరస్తజాతిగా, బిచ్చగాళ్ళుగా పేర్కొనడం సరికాదని ఆయన తెలిపారు. 31 ఇతర సంచార జాతులను బిచ్చగాళ్ళుగా పేర్కొని వారిని అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవోలో వీటిని సవరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంచార జాతుల వారి వద్ద వౌఖిక సాహిత్యం, జానపద కళలు ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీరముష్టి, పంబాల, కౌటిపాపల, జంగాలు, బుడబుక్కల, బాలసంతుల, కూనప్రలి వంటి జాతుల వారి వద్ద ఎంతో సమాచారం ఉందని ఆయన తెలిపారు. వీరు వృత్తి కళాకారులని ఆయన వివరించారు. కాబట్టి వీరిపై పరిశోధనాత్మక అధ్యయనం చేసి వారి సంస్కృతిని కాపాడుతూ వారి అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు. ఇదే విధంగా తెలంగాణలో కూడా వంద సంచార, అర సంచార జాతుల వారి అభ్యున్నతికై చర్యలు తీసుకోవాలని జయధీర్ తిరుమల రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.