తెలంగాణ

బహిరంగ చర్చకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: ‘తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు ఇచ్చిందో లెక్కలతో వస్తాం, మీరూ లెక్కలతో రండి, ప్రజల ముందు బహిరంగంగా చర్చిద్దాం..’ అని బిజెపి ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఎన్. రఘునందన్ రావు టిఆర్‌ఎస్ నాయకులకు, రాష్ట్ర మంత్రులకు సవాల్ విసిరారు. తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయంగా మారుతుందన్న భయంతో టిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని వారు శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తూ కేంద్రం రాష్ట్రానికి 92 వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పడాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర మంత్రులు ఎదురు దాడికి దిగారని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 32 వేల కోట్ల రూపాయలేనని రాష్ట్ర మంత్రి టి. హరీశ్ రావు అన్నారని వారు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అర్థంపర్థం లేకుండా విమర్శించారని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం 92 వేల కోట్ల రూపాయలు ఏయే పద్దుల కింద ఏయే పథకాలకు విడుదల చేసిందో ఆధారాలతో లెక్కలు చూపిస్తామని వారు చెప్పారు. ఇంత చేసినా కేంద్రం సహకరించడం లేదని, పొరుగు రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయని విమర్శించడం అర్థరహితమని వారన్నారు. పైగా కేంద్రం వద్దకు బిక్షమెత్తుకోవడానికి వెళ్ళాలా? అంటూ టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని వారు చెప్పారు. అలాగైతే గ్రామ పంచాయతీలూ రాష్ట్రం వద్దకు బిక్షం ఎత్తుకోవడానికి రావాలా? అని వారు ప్రశ్నించారు. 30 నుంచి 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు బదిలీ చేయడం లేదని వారు విమర్శించారు.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని మరో నాయకునిగా కట్టబెట్టగలరా? అని వారు ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే మరొకరిని పార్టీ అధ్యక్షునిగా నియమించాలని వారు డిమాండ్ చేశారు.