తెలంగాణ

జడల రామలింగేశ్వరుడి జలవిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 14: చెర్వుగట్టు జడల రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ఆదిదంపతుల కల్యాణం అనంతరం కొండపైన గల కోనేటిలో జలవిహారం చేశారు. ఆలయ ప్రధానార్చకులు రామలింగేశ్వర శర్మ, ఉత్సవాల్లో పాల్గొన్న వేదపండితులు అల్లవరకు సుబ్రహ్మణ్య దీక్షావధాని ఆధ్వర్యంలో నిర్వహించిన తెప్పోత్సవం భక్తులను కనువిందు చేసింది. మంగళవారం రాత్రి పుష్కరిణిలో జల విహారం చేసిన పార్వతీ పరమేశ్వరులు బుధవారం ఉదయం కొండపై శేషవాహన సేవలో భక్తులను అలరింపచేశారు. వేలాది మందిగా తరలివస్తున్న భక్తులు నయనానందకరంగా సాగుతున్న బ్రహ్మోత్సవ విశేష పూజలు చేసి తన్మయత్వం చెందుతున్నారు. ఎటు చూసిన చెర్వుగట్టు శివభక్తుల సందడితో కోలాహలంగా కనిపిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా జడల రామలింగేశ్వరుడికి గర్భాలయంలో ఉన్న స్వామి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల కోసం దేవాలయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మంచినీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు, కొండపైకి రవాణ సౌకర్యం, ఆర్యోగ సమస్యలు, అంటువ్యాధులు తలెత్తకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా నేరాలు జరగకుండా నియంత్రిస్తున్నారు. ఆలయ కార్యనిర్వాహన అధికారి అనె్నపర్తి సులోచన, సూపరిండెంట్ తిరుపతి రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు.