తెలంగాణ

తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11:తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులపై ప్రభుత్వం దృష్టిసారించింది. అటవీ, పర్యావరణ అనుమతులపై శనివారం గచ్చిబౌలిలోని పర్యావరణ పరిరక్షణ పరిశోధన సంస్త సదస్సు నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల తలెత్తే ముంపు సమస్యలు, వీలైనంత వరకు ముంపు తీవ్రతను తగ్గించడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ప్రాజెక్టులను ప్రారంభించే ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై చర్చించారు. గ్రామాల ముంపు, ప్రజాభిప్రాయ నివేదికలను జోడించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీనిపై పర్యావరణ పరిరక్షణ పరిశోధన సంస్థ (ఇపిటిఐ) ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. చనాఖా- కొరటా, బ్యారేజీతో పాటు తుమ్మిడి హట్టి-కాళేశ్వరం ప్రాజెక్టులపై వచ్చే వారం ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. అటవీ, పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ అధికార యంత్రాంగం చేస్తున్న కృషి పట్ల ఇపిటిఆర్‌ఐ సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాణహిత, కాళేశ్వరం, సీతారామ, పాలమూరు- రంగారెడ్డి, తుపాకుల గూడెం, భక్తరామదాసు తదితర ప్రాజెక్టులపై చర్చించారు. ఈ వర్క్‌షాప్‌లో ఇపిటిఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ కళ్యాణ చక్రవర్తి, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెఖ్రటరీ ఎస్‌కె జోషి, ఇన్‌సిసి మురళీధర్‌రావు, చీఫ్ ఇంజనీర్లు బి. హరిరామ్ ఎన్ వెంకటేశ్వర్లు, సుధాకర్, కె వెంకటేశ్వర్లు, భగవంతరావు, సునీల్, అధికారులు పాల్గొన్నారు.