తెలంగాణ

ప్రైవేట్ టెలికాం సంస్థలకు దీటుగా సేవలు విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 14: ప్రైవేట్ టెలికాం సంస్థలకు దీటుగా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు విస్తరించి ప్రజల మన్ననలు పొందాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట కవిత పిలుపునిచ్చారు. గురువారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో జిల్లా టెలికాం సలహా కమిటీ సమావేశాన్ని ఎంపీ కవిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటి సంస్థ అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రైవేట్ టెలికాం సంస్థలను తట్టుకొని ప్రజలకు మరింత మేరుగైన సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆమె సూచించారు. నిజామాబాద్ నగరంలో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తున్నందున అందులో భాగస్వామ్యం కంపెనీలతో ఒప్పందం చేసుకుని వ్యాపారాన్ని విస్తృతం చేయాలని, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్స్ స్థాయిని పెంచాలని సూచించారు. డిగ్రీ కళాశాలలు ఉన్నచోట వైఫై, హాట్‌స్పాట్ ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు సూచించగా, ఇంతకు ముందు విద్యార్థుల సౌకర్యార్థమై తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి సంబంధించిన నిధులు మంజూరు కానందున అది సఫలం కాలేదన్నారు. దీనిపై స్పందించిన ఎంపీ కవిత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో వినియోగదారుల సేవా కేంద్రాలు 19మాత్రమే ఏర్పాటు చేశారని, ప్రజల సౌకర్యర్థమై అవసరమైన చోట మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన వైఫై, హాట్‌స్పాట్ గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు మూడు గ్రామాలను దత్తత తీసుకోవాలని నిర్ణయించినందున కందకుర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామస్థుల కోరిక మేరకు టవర్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ ప్రజలకు బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీ ఎస్ ఎన్ ఎల్‌ను ప్రోత్సహించేందుకు అందరికీ చెబుతారని బోధన్ పట్టణ ప్రజలకు కూడా బీ ఎస్ ఎన్ ఎల్ 4జీ సేవల పట్ల ఆసక్తి ఉన్నందున అక్కడ కూడా అతి త్వరలో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం రెండవ క్వార్టర్ బీఎస్‌ఎన్‌ఎల్ సేవల పట్ల అవార్డు పొందినందున అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఎంపీ కవిత అబినంధించారు. బీఎస్‌ఎన్‌ఎల్, అందులో పనిచేసే సిబ్బంది తమ సమస్యలను తెలియజేస్తే కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖకు నివేదించడం జరుగుతుందన్నారు. కామారెడ్డి పట్టణంలో త్వరలో 4జీ సేవలు ప్రారంభిస్తున్నట్లు జీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత బాన్సువాడ 4జీ సేవలను ప్రారంభించారు. జిల్లా టెలికాం అధికారులు, సలహా కమిటీ మెంబర్లు, బీఎస్‌ఎన్‌ఎల్ సంఘ నాయకులు పాల్గొన్నారు.
చిత్రం.. టెలికాం సలహా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ కవిత