తెలంగాణ

పుట్టిన రోజు జరుపుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ‘కాశ్మీర్ ఘటన నన్ను కలచి వేసింది, కాబట్టి ఈ నెల 17న నేను పుట్టిన రోజును జరుపుకోను, మీరూ నా పుట్టిన రోజు వేడుకలు జరపకండి..’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనతో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తానూ తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన పేర్కొన్నారు. కాబట్టి తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇలాఉండగా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్టప్రతి కోవింద్ ముఖ్యమంత్రికి లేఖ పంపించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజా సేవలో అంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టప్రతికి ధన్యవాదాలు తెలిపారు.