తెలంగాణ

మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందజూస్తున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మతాన్ని రెచ్చగొట్టి బీజేపి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నదని టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఒక హోటల్‌లో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మేధోమథనం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ కాశ్మీర్ పూల్వామా వద్ద జరిగిన దాడిని ఖండించారు. సమావేశంలో పాల్గొన్న నేతలు ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించి సంతాప సూచకంగా రెండు నిమిషాలు పాటించారు. ఈ సమావేశానికి టీ.పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ అధ్యక్షత వహించగా, సీఎల్‌పీ నేత భట్టివిక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, మధుయాష్కీ గౌడ్, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, వీ. హనుమంత రావు, టీ. జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి రోజున ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు జరిగాయి.