తెలంగాణ

ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ అని, 280వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖరరావు కొనియాడారు. గిరిజన జాతి శ్రేయస్సు కోసం సేవాలాల్ విధానంలో బీజేపీ తరఫున పనిచేస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ జయంతులు నిర్వహిస్తామని అన్నారు. ఇక ముందు కూడా ఇటువంటి ఉత్సవాలు తండాల్లో వాడల్లో కాకుండా మండల, అసెంబ్లీ, పార్లమెంటు కేంద్రాల్లో కూడా జరిపి ప్రజలను చైతన్యపరచడానికి కృషి చేస్తామని అన్నారు. బీజేపీ ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, ఎస్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు నానావత్ బిక్కునాథ్ నాయక్, ఎస్టీమోర్చ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బుల్లెట్ కృష్ణ నాయక్, జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీరాం నాయక్ పాల్గొన్నారు.