తెలంగాణ

ఉగ్రవాదుల పీచమణచాల్సిందే: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: జమ్మూకాశ్మీర్ పుల్వామా వద్ద జవాన్ల వాహనాలపై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడి 49 మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకోవడంపై రాజకీయ పార్టీల నేతలు, అనుబంధ సంస్థలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల పీచమణచాల్సిందేనని వారు పేర్కొన్నారు. ఉగ్రదాడిపై బీజేపీ నేతలు, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ నేతలు, యాంటీ టెర్రరిజం ఫోరం వేర్వేరు ప్రకటనల్లో జవాన్లకు బాసటగా నిలిచారు. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని పేర్కొంటూ పలు విద్యాసంస్థల్లోని విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారి ఆత్మశాంతి కోరుతూ బీజేపీ, హిందూ వాహిణీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం నుండి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ వాహిణీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి ప్రతి పౌరుడు చావడానికైనా , చంపడానికైనా సిద్ధమని అన్నారు. ఉగ్రమూలాలు కూకటివేళ్లతో పెకిలించాలని అన్నారు. ఇంత వరకూ లేకున్నా నరేంద్రమోదీ సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని రాజాసింగ్ అన్నారు.
యాంటీ టెర్రరిజం ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో విద్యార్థులు, యువకులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రధాన కూడలిలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ పతాకాలతో ర్యాలీలో పాల్గొన్న యువత విద్యార్థిలోకం తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కాశ్మీర్‌ను రక్షించుకోవడానికి భారత సైన్యం, దేశ ప్రజలు ఎంతటి త్యాగాలకైనా వెనుకడుగు వేయదని ముందుకు సాగినట్టు రాష్ట్ర కన్వీనర్ ఎస్ బ్రహ్మచారి చెప్పారు. ఈ సందర్భంగా ఏటీఎఫ్ జాతీయ కన్వీనర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ గడచిన నాలుగున్నరేళ్లలో జమ్మూకాశ్మీర్‌లో భారత సైన్యం, భద్రతా దళాలు, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో ఏరివేసే పనిలో వేగంగా ముందుకు దూసుకువెళ్తున్నాయని, అనేక దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత ప్రాంతాలుగా ఉన్న జిల్లాలు నేడు ఆ సమస్య నుండి పూర్తిగా విముక్తం అయ్యాయని, చొరబాటు దారులను సరిహద్దు రేఖవద్దనే అంతమొందించి పాక్ కుట్రలను ఎప్పటికపుడు భద్రతాదళాలు భగ్నం చేస్తున్నాయని, గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం , సైన్యం కాశ్మీర్ యువతకు పలు రంగాల్లో ఉపాధి కల్పించి అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తోందని అన్నారు.
ఉస్మానియా అధ్యాపకుల సంఘం ఔటా నేతలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ బీ సత్యనారాయణ ఒక ప్రకటన విడుదల చేస్తూ భరతజాతి యావత్తు ఒక్కత్రాటిపైకి రావాలని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, వరంగల్ నిట్ తదితర సంస్థల్లో సైతం ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.