తెలంగాణ

గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, ఫిబ్రవరి 15: టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలోనే తండాలకు, గిరిజనులకు గుర్తింపు వచ్చిందని, రాబోయే రోజుల్లో గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని జెరిపోతుల తాండా గ్రామంలో శుక్రవారం నాడు శ్రీసత్ సేవాలాల్ మహరాజ్ 280 జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మహా ధోగ్ భండారే సందర్భంగా సర్పంచ్ బుక్య భిక్షపతి నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన హరీష్‌రావుకు తండా వాసులు డప్పు సప్పుళ్లతో.. లంబాడీ మహాళలు నృత్యాలు చేస్తు ఆయనకు కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మీరంతా చందాలు వేసుకుని గతంలో ఉత్సవాలు జరుపుకునే వారని గుర్తు చేశారు. అన్ని కులాలు, మతాలను గౌరవించాలనే సంప్రదాయం కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే నిర్వర్తిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలు మార్చాలని, రాష్ట్రంలోనే 3200 తండాలలో లంబాడీలే సర్పంచులయ్యారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఆడపిల్లల్ని అమ్ముకునే పరిస్థితి ఉండేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక పేదింటి ఆడపెళ్లికి లక్షావంద పదహారు రూపాయలు అందిస్తుందించి పేద కుటుంబాల్లో వెలుగు నింపుతున్నామన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎస్సీ, ఎస్టీల విద్య కోసం పెద్ద పీట వేసి విద్యాలయాలను నెలకొల్పిందన్నారు. పేద విద్యార్థులకు అధిక ప్రాధాన్యత నిచ్చి విదేశీ విద్యల అధిక ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పదివేలు, కేంద్రం నుండి ఆరు వేలు రైతు బంధు పథకం ద్వారా రైతుకు పంట సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గోదావరి జలాలు తేవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వెంకటాపూర్ గ్రామంలో రైతులకు పట్టాదార్ పాసుపస్తకాలను పంపిణీ చేసి, నాగరాజుపల్లిలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటీ శద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సిద్దిపేట మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, నేతలు దువ్వల మల్లయ్య, కిష్టారెడ్డి, కోల రమేశ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, సర్పంచులు పాకాల కల్పన బాబు, పల్లి భాగ్యలక్ష్మీ, గ్రామస్తులు లక్ష్మణ్‌నాయక్ కోటిరెడ్డి పాల్గొన్నారు.