తెలంగాణ

ఉపాధి నైపుణ్యంపై బ్రిటిష్ కౌన్సిల్‌తో ఉన్నత విద్యామండలి రౌండ్ టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఉపాధి, ఉపాధి నైపుణ్యంపై బ్రిటిష్ కౌన్సిల్ సహకారంతో 18వ తేదీన రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్ళి అజయ్ మిశ్రా, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఐటి కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం , వ్యవసాయ వర్శిటీ వీసీ ప్రొఫెసర్ వీ ప్రవీణ్‌రావు హాజరవుతారు. మార్కెట్‌లో ఉపాధికి, ఉపాధి అవకాశాలకు, నైపుణ్యాలకు మధ్య ఉన్న అగాధంపై వారు మాట్లాడతారు. అంతర్జాతీయ పరిస్థితులపై ఆర్‌జీయుకేటీ వీసీ డాక్టర్ ఏ అశోక్, ఇక్ఫాయి వీసీ ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి, పారిశ్రామిక వేత్త వై ఎల్లారెడ్డి, గురుకుల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్, సాయంత్రం జరిగే సదస్సుల్లో ఎంజీ వర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్త్ఫా హుస్సేన్, జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డి, ఫైన్ ఆర్ట్సు వర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఎన్ కవితా దర్యానీ రావు, పాలమూరు వీసీ ప్రొఫెసర్ బి రాజారత్నం తదితరులు పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ప్రొఫెసర్ లింబాద్రిలు సమావేశ నిర్ణయాలను ప్రకటిస్తారు.