తెలంగాణ

హైదరాబాద్‌లో అత్యాధునిక బస్టాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: హైదరాబాద్‌లో బస్సు ప్రయాణీకుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో బస్టాండ్‌ను నిర్మించడానికి ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వినూత్న తరహాలో బస్సు ప్రయాణీకులను ఆకర్షించడానికి భారీ వ్యయంతో అత్యాధునిక హంగులతో బస్టాండ్‌లను తీర్చిదిద్దాలని ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ సంస్థను లాభాల్లో నడపడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి అన్ని మార్గాలను అనే్వషిస్తున్నారు. దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రధాన పట్టణాల్లో బస్టాండ్‌ల స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం పంపించింది. శనివారం బస్సు భవనంలో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మకు అధ్యయన నివేదికను అందచేశారు. ఈ అధ్యయన బృందంలో ఈడీలు పురుషోత్తం, రాజేంద్రప్రసాద్, సీతారాంబాబు ఉన్నారు. బస్టాండ్‌ల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిధులను సమీకరిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆరున్నర ఎకరాల్లో రూ. 230 కోట్ల రూపాయలతో అత్యంత హంగులతో బస్టాండ్‌ను నిర్మించారు. ఈ బస్టాండ్ నిర్మాణాన్ని శాలిమార్ నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. ఈ బస్టాండ్ నిర్వహణ బాధ్యత దాదాపు 33 ఏళ్ళ పాటు లీజుకు తీసుకుంది. ఈ బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ స్థలం, బస్‌బేలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, ఆహ్లదకరంగా విశ్రాంతి గదులు, సంస్థాగత కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఈ బస్టాండ్‌లో ఒకేసారి 100 బస్సులు పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంది. విమానాశ్రయాల తరహాలో సెక్యూరిటీ విధానాన్ని అమలు చేస్తారు. ఈ బస్టాండ్‌ను మూడు అంతస్థులతో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోరులో మ్తొతం 49 ప్లాట్ ఫాంలను ఏర్పాటు చేశారు. ఏఏ బస్సులు ఎక్కడికి వస్తాయన్న విషయాలను డిజిటల్ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. తొలి విడతలో హైదరాబాద్ జూబ్లీ, గౌలిగూడ, ముషీరాబాద్‌లోని ఖాళీ స్థలంతో పాటు యాదాద్రిలో నూతన బస్టాండ్‌ల కోసం ఎంపిక చేయనున్నారు. కాగా తెలంగాణ జిల్లాల్లో పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో కిడ్నీ బాధితులకు ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ప్రకటించారు. ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ బాధితులు దాదాపు 7600 మంది ఉన్నారని అధికారులు గుర్తు చేశారు. ఆర్టీసీ నిర్ణయాన్ని కిడ్నీ బాధితులు స్వాగతించారు.
చిత్రం.. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో నిర్మించిన ఆధునిక బస్టాండ్‌లపై
అధ్యయన నివేదికను ఆర్టీసీ ఎండీకి అందజేస్తున్న బృందం సభ్యులు