తెలంగాణ

25వేల ఆలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: భీష్మ ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 25 వేల ఆలయాలలో సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం జరిగింది. విష్షుసహస్రనామ స్తోత్రం జన్మించింది ఈ రోజే. అందుకే ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భీష్మపితామహుడు తన తనువును చాలించేందుకు ఉత్తరాయణ పుణ్య కాలం కోసం భాణాలతో ఏర్పాటు చేసిన పడకపై పడుకుని కాలం గడుపుతారు. మహారుషులు తమకు తెలిసిన సృష్టి రహస్యాలను భీష్ముడికి వివిధ సందర్భాలలో వివరిస్తారు. మహారుషులు వెల్లడించిన రహస్యాలన్నింటినీ భీష్ముడు ఏర్చికూర్చి ‘శ్రీ విష్ణుసహస్ర నామ స్తోత్రం’గా పాండవులకు మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి రోజు బోధిస్తారు. ఆ విధంగా భీష్ముడు బోధించిన రోజు కనుకనే ఈ రోజును భీష్మఏకాదశి అంటారు. శ్రీవిష్ణుసహస్ర నామ పారాయణం బోధన తర్వాత భీష్ముడు తనువు చాలించి భగవంతుడిలో ఐక్యం అవుతారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యత ఉండట వల్లనే దేశవ్యాప్తంగా ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో, ఇతర ప్రదేశాల్లో శ్రీవిష్ణుసహస్ర నామ పారాయణాన్ని చేస్తారు. తెలంగాణలోని భద్రాచలం, యాదాద్రి, జిల్లెల్లగూడ తదితర ప్రధాన ఆలయాల్లో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విష్ణుసహస్ర నామపారాయణంలో పులకించిపోయారు. ఈ సందర్భంగా నదుల్లో పుణ్యస్నానాలు చేసి భక్తులు ఉపవాసం ఉంటారు.