తెలంగాణ

శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు చెందాలంటే ముఖ్యంగా శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లో రూ. 510 లక్షలతో ఆధునిక వసతులతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా శాంతిభద్రలపై దృష్టిపెట్టడంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. రాష్ట్రంలో పోలీస్ విధినిర్వహణ కోసం పెట్రోలింగ్ చేయడానికి 11000 వాహనాలను సమకూర్చామన్నారు. ఇక నుంచి రాచకొండ కమిషనరేట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కమిషనరేట్ భవనాలు కేవలం 18 మాసాల్లో పూర్తి చేశారన్నారు. ప్రజలు ఊహించినట్లుగా పోలీస్‌లు సేవలు ఉండాలన్నారు. తక్కువ సమయంలో భవనాలను పూర్తి చేయడానికి కృషి చేసిన అధికారులతో పాటు నిర్మాణ సంస్థల యజమాన్యాన్ని హోంమంత్రి అభినంధించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అందకు పోలీస్ సహకారం ఎంతో అవసరం అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడం జరిగిందన్నారు. పోలీస్ సిబ్బంది మరింత ఉత్సాహంగా పని చేయడానికి వౌలిక వసతులతో పాటు ఆధునిక సాంకేతిక వ్యవస్థను యుద్ధప్రతిపదికన ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. నేరాలను అదుపు చేయడానికి సీసీటీవీ కెమెరాలను అన్ని ప్రాంతలకు విస్తరింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ అధికారి తమ ఉద్యోగ వ్యవహార శైలిని మార్చుకుని పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి కమ్యూనిటీ వర్గాలతో కౌన్సిలింగ్ చేయడంతో ఆయా వర్గాలు పోలీస్‌కు దగ్గర అవుతారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగ ప్రకటనలతో యువత మొసపోతోందని, దీనికి పోలీసులే ముందకు వచ్చి ఆయా రంగాల ప్రతినిధులతో నిరుద్యోగులకు జాబ్‌మేలా ఏర్పాటు చేయడంతో యువతకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సీసీటీవీల ఏర్పాటు కోసం గేయిల్ సంస్థ రూ 25లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిందన్నారు. కమిషనరేట్ పరిధిలో వివిధ పనుల కోసం జీఎంఆర్ సంస్థ రూ 35 లక్షల రూపాయలు సమకూర్చిందన్నారు. అలాగే ఇన్ఫోసిస్ యాజమాన్యం ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి కెపాల్ వరకు చేపడుతున్న పనులకు రూ 5 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన పనితీరుపై నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, స్థానిక మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు, ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి, అహమ్మద్ బాష కాద్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్స్ అనితా రామచంద్రణ్, ఎంవీ రెడ్డి, కార్పొరేటర్ లోకేష్‌కుమార్, పోలీస్ అధికారులు నవీన్‌చంద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ గోపాల్ క్రిష్ణ పాల్గొన్నారు.
చిత్రం.. హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని
ఆదివారం ప్రారంభిస్తున్న రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ