తెలంగాణ

లోక్‌సభ ఎన్నికల్లో దేశభక్తులు.. స్వార్థపరుల మధ్యే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దేశ భక్తులకు - స్వార్థపరులకు, నీతివంతులకు - అవినీతిపరలకు మధ్యే పోటీ ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ అన్నారు. అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పిన బీజేపీకి ఘన విజయం చేకూర్చాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శివసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌పీ మహేష్ కుమార్‌తో పాటు కొంత మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ కే. లక్ష్మణ్ ప్రసంగిస్తూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ విజయాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రావడం, నరేంద్ర మోదీ ప్రధానిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించడం ఖాయమని ఆయన తెలిపారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా తప్పిదం చేస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రధాన మంత్రి సురక్ష యోజన కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. దేశ వ్యాప్తంగా గతత మూడు నెలల్లో 11 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఈ పథకం అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎంపీ రాంస్వరూప్ కోలి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, పార్టీ మీడియా రాష్ట్ర కన్వీనర్ వి. సుధాకర్‌శర్మ, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.