తెలంగాణ

అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు 65వ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి, టీ-న్యూస్, నమస్తే తెలంగాణ అధ్వర్యంలో సంవత్సరం పాటు అవయవదాన మహా సంకల్పాన్ని చేపట్టారు. ఆదివారం పీపుల్స్ ప్లాజాలో కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో కూడా ఆదివారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత కాశ్మీర్, పుల్వామాలో రెండు రోజు రోజుల క్రితం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించి, రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఇలాఉండగా అవయవ దానంపై ‘నిమ్స్’ ఆసుపత్రితో తెలంగాణ జాగృతి ఒప్పందం (ఎంవోయు) చేసుకుంది. ఈ ఒప్పంద పత్రంపై ఎంపీ కవిత సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీమీ పాటిల్, ఎమ్మెల్యే8లు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రసంగిస్తూ సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభమైనట్లు ఆమె తెలిపారు. సుమారు 50 వేల మందితో సంతకాలు చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె చెప్పారు. అవయవ దానంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని అన్నారు. అవయవ దానం ఎలా చేయాలి?, ఎవరికి సమాచారం ఇవ్వాలి, ఏ సమయంలో సమాచారం ఇవ్వాలి?, దానికి అర్హులు ఎవరు? అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. పేద ప్రజల కష్టాలు తీర్చే గొప్ప మనసు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కవిత అన్నారు.
చిత్రం.. నిమ్స్‌తో కుదుర్చుకున్న అవయవదాన ఒప్పంద పత్రాన్ని నిమ్స్ డైరెక్టర్‌కు అందజేస్తున్న ఎంపీ కవిత