తెలంగాణ

ఇంజనీరింగ్ అద్భుతం ‘కాళేశ్వరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అధ్భుతమైన వర ప్రదాయమని 15వ ఆర్ధిక సంఘం సభ్యులు అశోక్ లాహిరి, రీతా లాహిరిలు అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్న 15వ ఆర్ధిక సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం జయశంకర్‌భూపాలపల్లిజిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు నేరుగా ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులకు చూపించడంతో పాటు ఫోటో ఎగ్జిబిషన్, మ్యాప్‌ల ద్వారా ప్రాజెక్టు నిర్మాణం తీరును , ప్రాజెక్టు వల్ల కలిగే లబ్ధిని ఈ సందర్భంగా వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు 80శాతానికి పైగా పూర్తి అయిందని, మేడిగడ్డ బ్యారేజీలో 18లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్స్ వాడాల్సి ఉండగా ఇప్పటికే 16లక్షల క్యూబిక్ మీటర్లు వాడామని 85 గేట్లకుగాను ఇప్పటికే 20 గేట్లు పూర్తి అయ్యాయని అన్నారు. మిగితా పనులు ఎప్రిల్ నెల చివరిలోగా పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నుండి కనె్నపల్లి పంప్‌హౌజ్ ద్వారా ప్రతి రోజు రెండు టీ ఎంసీల నీటిని పంపు చేసేందుకు ప్రయాత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 80వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 37.08 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయిన రెండున్నార సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టు పూర్తి చేశామని వివరించారు. ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యతనిస్తూ నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్ధిక సంఘం తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కోరారు. ఈ సందర్భంగా ఆర్ధిక సంఘం సభ్యులు అశోక్ లాహిరి, రీతా లాహిరి, సంఘం కార్యదర్శి ఆరవింద్ మోహత మాట్లాడుతూ ఇంత పెద్ద నది గర్భంలో ప్రాజెక్టు నిర్మాణం తిరోగమన దిశలో వీటిని మల్లిస్తూ ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరుపేద రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంకల్పానికి తమ సకారం ఉంటుందని చెప్పారు. నిర్ధేశిత సమయంలోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తియై పంట పోలాలకు నీరు చేరితే ఈ ప్రాజెక్టు నిర్మాణం భావితారాలు ఆదర్శంగా ఉంటుందని అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నీరు వచ్చినప్పుడు సంవత్సరం లోగా అన్నారం బ్యారేజీ పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పడు అన్నారం ప్రాజెక్టు పూర్తిచేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత పర్యటక రంగానికి చాలా అవకాశాలు ఉన్నందున దానిపై దృష్టి సారించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో 15 ఆర్ధిక సంఘం సంయుక్త కార్యదర్శి డాక్టర్ రవీ, ప్రభుత్వ సలహాదారుడు జీవీకే రెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ భాస్కరన్, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు పాల్గొన్నారు.
చిత్రం.. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న బృందం, వివరాలు వెల్లడిస్తున్న ఇంజనీర్లు