తెలంగాణ

కృష్ణయ్యది అవకాశవాద రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఆర్ కృష్ణయ్య వంటి అవకాశవాద బీసీ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ కార్యదర్శి వి హనుమంతరావు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్...ప్రస్తుతమేమో వైఎస్‌ఆర్‌సీపీనా అని హనుమంతరావు ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో సోమవారం విహెచ్ మీడియాతో మాట్లాడుతూ, బీసీ నాయకుడనే ఆర్ కృష్ణయ్యకు మిర్యాలగూడ నుంచి రాహుల్‌గాంధీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్న్ ఆర్ కృష్ణయ్య ఎందుకు అడుగలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే పార్టీలకు బీసీలు గుర్తుకు వస్తారా? అని ప్రశ్నించారు. బీసీలకు ప్రభుత్వాలు చేసేది తక్కువా, చెప్పుకునేది ఎక్కువని విమర్శించారు. బీసీలకు అమలు చేస్తోన్న క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోన్నా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీలు రాజ్యాంగబద్ధ పదవులు చేపట్టకూడదా? కుల వృత్తికే పరిమితం కావాలా? అని విహెచ్ నిలదీశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి పెట్టి రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని విహెచ్ పిలుపునిచ్చారు.