తెలంగాణ

తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షునిగా నగునూరి శేఖర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యుజె) అధ్యక్షునిగా నగునూరి శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన బిఎస్ రామకృష్ణ సోమవారం ప్రకటించారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడితో పాటు రాష్ట్ర కౌన్సిల్‌కు 50 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆయన ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పరిశీలనా, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో అధ్యక్ష పదవికి నగునూరి శేఖర్ ఒక్కరే నామినేషభ్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీలో 50 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యులకుగాను ఆ సంఖ్య మేరకే నామినేషన్లు దాఖలు కావడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షునిగా రెండవ సారి నగునూరి శేఖర్ ఎన్నిక కావడం పట్ల సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు మాజీద్, ఐజెయు సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు రాజేశ్, హెచ్‌యుజె నాయకులు శంకర్ తదితరులు పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రం.. నగునూరి శేఖర్‌ను అభినందిస్తున్న ఐజేయూఅధ్యక్షుడు దేవులపల్లి అమర్