తెలంగాణ

మంత్రి పదవి రాలేదన్న బాధ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ‘మంత్రి పదవి రాలేదన్న బాధ లేదు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం. టీఆర్‌ఎస్‌లో నేనొక సైనికుడిని, ఏ బాధ్యత అప్పగించినా ఒక సామాన్య కార్యకర్తగా పని చేస్తా’నని మంత్రిమండలిలో స్థానం దక్కని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాజ్‌భవన్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానన్నారు. పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా, క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ఉంటానన్నారు. పదవి దక్కలేదన్న అసంతృప్తి ఏ కోశాన లేదన్నారు. సోషల్ మీడియాలో తానేదో అసంతృప్తిగా ఉన్నట్టు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని హరీశ్‌రావు ఖండించారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో ఎటువంటి గ్రూపులు కానీ, సేనలు కానీ లేవు. అలా ఎవరైనా గ్రూపులు పెట్టి ఏదైనా పోస్టు చేస్తే వాటితో ఎలాంటి సంబంధం లేదు. వాటిని ఎవరు సీరియస్‌గా తీసుకోవద్దు’ అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం, సీఎం కేసీఆర్ కోసం శ్రేణులంతా సమిష్టిగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రికి చేదోడు, వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని మరో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మంత్రి పదవి రాలేదన్న బాధలేదన్నారు. తాను మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఒక సుశిక్షిత కార్యకర్తగా పని చేస్తున్నన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమనగానే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాజీనామా చేశానని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. భవిష్యత్‌లో సీఎం కేసీఆర్‌కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌గానీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.