తెలంగాణ

90 రోజులు.. 6 మంత్రి పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఎప్పుడెప్పుడా అని 66 రోజులుగా ఎదురు చూస్తోన్న మంత్రివర్గ విస్తరణ మంగళవారం జరిగిపోయింది. అయితే చోటు దక్కించుకోవడానికి మరో ఆరుగురికి స్థానం కల్పించడానికి భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా ఖాళీగా పెట్టారు. దీంతో మంత్రివర్గంలో స్థానం లభించని మాజీ మంత్రులకు మరో అవకాశం మిగిలే ఉంది. టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం పార్లమెంట్ ఎన్నికలకు మూడు నెలల వ్యవధి మాత్రమే ఉండటంతో ఆ ఎన్నికల తర్వాతనే మూడవ దఫా మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ లోగా ఒకటి రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం కూడా లేకపోలేదన్న మరో వాదన వినిపిస్తోంది. మంత్రివర్గంలో మహిళలకు, గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ రెండింటిని భర్తీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గిరిజన సామాజిక వర్గం నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్‌గానీ, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కానీ అవకాశం మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించారు. రెండో దశ విస్తరణలోనే వీరిద్దరిలో ఎవరికి అవకాశం కల్పించాలన్నది తేల్చుకోలేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. శాసనసభలో కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తర్వాత సీనియర్ అయినా రెడ్యానాయక్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్ మొదటి నుంచి మొగ్గు కనబర్చారు. అయితే రేఖా నాయక్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించడం వల్ల మహిళా, గిరిజన రెండు కోటాలు భర్తీ చేసినట్టు అవుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ వీరిలో ఎవరికి అవకాశం కల్పించాలన్నది నిర్ణయం తీసుకోవడానికి పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఇలా ఉండగా గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసి ఈ సారి మంత్రిమండలిలో స్థానం లభించని మాజీలు ఆరుగురు మిగిలిపోయారు. వీరిలో హరీశ్‌రావు, కేటీఆర్, పద్మారావు, కడియం శ్రీహరి, జోగురామన్న, లక్ష్మారెడ్డి ఉన్నారు. వీరందరికి అవకాశం కల్పించిన సరిపోయేలా ఆరు మంత్రి పదవులు ఇంకా ఖాళీకా ఉంచారు. మంత్రిమండలిలో అవకాశం కల్పించకుండా పక్కన పెట్టిన ఆరుగురు మాజీల కదలికలను మూడు నెలల పాటు గమనించి, ఆ తర్వాతనే వీరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం భావిస్తోన్నట్టు సమాచారం. అప్పటి వరకు మాజీ మంత్రుల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు డేగా కన్ను వేసి, సీఎం కేసీఆర్‌కు, పార్టీకి విధేయులుగా నమ్మకం కలిగించిన వారికే మూడో దఫాలో అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మినహాయించి 16 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో పటోళ్ల మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్ నలుగురు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. మిగిలిన 12 మందిలో మహమూద్ అలీ, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్‌రెడ్డికి తిరిగి ఈ సారి మంత్రివర్గంలో చోటు లభించింది. మిగిలిన ఏడుగురిలో పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్పీకర్‌గా అవకాశం కల్పించడంతో హరీశ్‌రావు, కేటీఆర్, జోగురామన్న, పద్మారావు, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి ఆరుగురికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయినప్పటికీ ఇంకా ఆరు ఖాళీలను అలాగే ఉంచడంతో వీరిలో కనీసం ముగ్గురికైనా అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.