తెలంగాణ

విద్యా మంత్రిగా జగదీష్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ విద్యా మంత్రిగా జీ జగదీష్‌రెడ్డి గురువారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ తొలి మంత్రివర్గంలోనే జీ జగదీష్‌రెడ్డి విద్యామంత్రిగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఆయనను ఇంధన శాఖకు మార్చి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి విద్యామంత్రిత్వశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అప్పగించారు. రెండో అసెంబ్లీలో మళ్లీ విద్యాశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీష్‌రెడ్డికే అప్పగించారు. ప్రాధమిక విద్య, మాధ్యమిక విద్య, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత విద్య, యూనివర్శిటీ విద్య, సాంకేతిక విద్యతో పాటు అనుబంధ సంస్థలైన ఎస్సీఈఆర్టీ, సైట్, ఉన్నత విద్యామండలి, ప్రభుత్వ పరీక్షల బోర్డు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణాలయం, ఓపెన్ స్కూల్ సొసైటీ, ఇంటర్మీడియట్ బోర్డు వంటివి అన్నీ కలిపి విద్యాశాఖగా ఈసారి ఒకే గొడుగుకిందకు తీసుకువచ్చారు. సచివాలయం డీ బ్లాక్ మొదటి అంతస్తులోని 237 వ నెంబర్ చాంబర్‌ను మంత్రికి కేటాయించారు. గురువారం ఉదయం 10 గంటలకు మంత్రి బాధ్యతలు స్వీకరించనున్నారు.
కొత్త విద్యా మంత్రి జి జగదీష్‌రెడ్డిని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్‌మిశ్రా అభినందనలు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ డాక్టర్ ఎ అశోక్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి , ఫార్మసీ కాలేజీల యాజమాన్యాల సంఘం నాయకులు డాక్టర్ రామదాస్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం నాయకులు డాక్టర్ గౌతం, సునీల్ కుమార్ సహా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు జగదీష్‌రెడ్డిని అభినందించారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి జగదీష్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్‌మిశ్రా మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసి ప్రస్తుత స్థితిని వివరించారు. మిగిలిన అధికారులతో మంత్రి గురువారం నాడు సమీక్షించనున్నారు.
వేతన సిఫార్సులు అమలు చేయండి
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న యూజీసీ అధ్యాపకులకు ఏడో వేతన సంఘం సవరించిన వేతన స్కేళ్లను అమలుచేయాలని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఫ్యాకల్టీ టీచర్సు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఐ ఆనంద్ పవార్ కోరారు. ఈ మేరకు మంత్రి జగదీష్‌రెడ్డికి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీ శ్రీనివాస్, కోశాధికారి డాటర్ కే కృష్ణారెడ్డి తదితరులు ఈ అంశంపై మాట్లాడుతూ మంత్రి త్వరగా వేతన స్కేళ్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.