తెలంగాణ

విద్యారంగంలో విలసిల్లిన తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: జాతీయ ప్రమాణాలను అధిగమించడం ద్వారా విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేసుకుంది. ఉన్నత విద్యలో చేరుతున్న వారి సగటు జాతీయ స్థాయిలో 24.5 శాతం కాగా, తెలంగాణలో అది 36.3 శాతం ఉంది.
ప్రాధమిక స్థాయిలో 103.02 శాతం, యుపీ స్థాయిలో 89.41 శాతం, ఎలిమెంటరీ స్థాయిలో 97.79 శాతం, సెకండరీ స్థాయిలో 82.53 శాతం, సీనియర్ సెకండరీలో 61.32 శాతం, హయ్యర్ సెకండరీలో 36.3 శాతం స్థూల ప్రవేశాల నిష్పత్తి నమోదైంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల వివరాల్లో పేర్కొంది. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు 3059, ఏకీకృత విద్యాసంస్థలు 584 ఉన్నాయి. 21 యూనివర్శిటీలు, 2454 కాలేజీలు, 21948 పాఠశాలలు, 7189 యుపీ, 11333సెకండరీ పాఠశాలలు, 2162 సీనియర్ సెకండరీ కాలేజీలు ఉన్నాయి. పాఠశాలల్లో చేరుతున్న ఎస్సీలు 107.2 శాతం ఉంది, ఇది దేశంలోనే అత్యధికం. యూపీ స్కూళ్లలో 90.95 శాతం, హైస్కూళ్లలో 84.65 శాతం మంది ఎస్సీ విద్యార్థులు చేరుతున్నారు. ఉన్నత విద్యలో చేరే వారి శాతం 36.1గా ఉంది. పాఠశాలల్లో చేరే ఎస్టీలు 106.2 శాతం కాగా, ఉన్నత విద్యలో చేరే వారు 33.9 శాతం మంది ఉన్నారు. 98.3 శాతం యూపీ స్కూళ్లలో తాగునీటి సదుపాయం అందుబాటులో ఉంది. అన్ని రకాల స్కూళ్లనూ తీసుకుంటే 94 శాతం పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉంది. మరుగుదొడ్ల విషయానికి వచ్చే సరికి తెలంగాణలో 74 శాతం పాఠశాలల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యూపీలో 100 శాతం స్కూళ్లలో మరుగుదొడ్లున్నాయి. జాతీయ స్థాయిలో విద్యాత్మక సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకుంటే సగటు 250 కాగా, తెలంగాణలో అది 245గా ఉంది. గణితంలో జాతీయ సగటు 250కాగా, తెలంగాణలో అది 260గా నమోదైంది.
మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం మంజూ రు చేసిన నిధులను వినియోగించుకోవడంలో తెలంగాణ 106.77 శాతం నమోదు చేయగా, 2016-17లో అది 93.45 శాతంగా నమోదైంది. సర్వశిక్షా అభియాన్ కింద మంజూరైన నిధులు 41.27 శాతం మాత్రమే వెచ్చించగలిగారు. 2016-17లో 67.21 శాతం నిధులను వెచ్చించగలిగారు. జాతీయ స్థాయిలో మొత్తంగా చూసుకుంటే 9.08 లక్షల టీచర్ల కొరత ఉందని ఈ లెక్కలు తేల్చాయి. డీఈడీ చేసిన వారు 83791 , బీఈడీలు 5,28,149 మంది అందుబాటులో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా లేకుండా పనిచేస్తున్న టీచర్ల సంఖ్య 24921గా ఉన్నట్టు గుర్తించారు.