తెలంగాణ

కొత్త సచివులతో కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు మంత్రులు బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు పార్టీ ముఖ్యులను కలిసి ఆశీస్సులు పొందారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిత తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మరి కొందరు మంత్రులు పార్టీ ముఖ్యులను కలిసి తమకు మంత్రిపదవులు దక్కడానికి కృషి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎక్సైజుశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి నిజాబాబాద్ ఎంపీ కవితను ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనసభకు వచ్చి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసారు. అనంతరం శాసనసభ సమావేశాల నిర్వహణపై స్పీకర్ చాంబర్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి హోదాలో తొలిసారి శాసనసభకు వచ్చిన ప్రశాంత్‌రెడ్డికి శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహచార్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలంగాణ భవన్‌కు వెళ్లి కొద్దిసేపు గడిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాసానికి వెళ్లి పౌరసరఫరాలశాఖ కమీషనర్ ఆకున్ సబర్వాల్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా ఉండగా విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయం డి బ్లాక్‌లో తమకు కేటాయించిన చాంబర్లలో పూజలు నిర్వహించి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
చిత్రం.. ప్రగతిభవన్‌లో తమ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న మంత్రులు కొప్పుల ఈశ్వర్.