తెలంగాణ

అమెరికాలో దోపిడీ..కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు(ఎం), ఫిబ్రవరి 21: ఆమెరికాలోని ఫ్లొరిడాలో దుండగుడి తుపాకీ కాల్పులకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆత్మకూర్ (ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి (42) మృత్యువాత పడ్డాడు. ఫ్లోరిడాలోని డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో కౌంటర్ మేనేజర్‌గా పనిచేస్తున్న గోవర్ధన్‌రెడ్డిపైన, అతడితో ఉన్న మరో వ్యక్తిపైన ఆగంతకుడు కాల్పులు జరుపగా గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అమెరికా, ఇండియా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత కాలమానం మేరకు బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రాత్రి స్టోర్ మూసివేసే సమయంలో ముసుగు ధరించి వచ్చిన నల్ల జాతీయ దుండగుడు గోవర్ధన్‌రెడ్డిపై కాల్పులు జరిపి స్టోర్‌లో దోపిడికి పాల్పడ్డాడు. దుండగుడి కాల్పుల్లో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు గోవర్ధన్‌రెడ్డి ఏడు సంవత్సరాల క్రితం అమెరికాకు జీవనోపాధి కోసం వెళ్లాడు. ఆయనకు భార్య శోభారాణి, కూతుర్లు శ్రీయ (పదోతరగతి), తులసీ (ఏడోతరగతి)లు ఉన్నారు. వారు ఎనిమిదేళ్లుగా బోడుఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. గోవర్ధన్‌రెడ్డి మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాధంలో మునిగింది. మృతదేహాన్ని స్వగ్రామం రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులు పద్మ, నర్సిరెడ్డిలు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న గోవర్ధన్‌రెడ్డి స్వదేశంలో బోర్ల వ్యాపారం, ఆన్‌లైన్ గోల్డ్ అమ్మకాల వ్యాపారం చేసినా కలిసిరాకపోవడంతో బంధువుల ద్వారా ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి డిపార్ట్‌మెంట్ స్టోర్ రూమ్‌లో అకౌంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు చెల్లెళ్లు కూడా ఉన్నారు. వారిలో మూడవ చెల్లి భర్తను కూడా గోవర్ధన్‌రెడ్డి తన వెంట అమెరికాకు తీసుకెళ్లారు. గోవర్ధన్‌రెడ్డి ఉద్యోగ ఒప్పందం మరో రెండు నెలల్లో పూర్తికానుండగా స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ భూమి కొనుగోలు చేసి స్వదేశంలోనే ఉండాలని భావించాడని, ఇంతలోనే ఆయన హత్యకు గురవ్వడం కుటుంబ సభ్యులకు తీవ్ర వేదనను మిగిల్చింది.
చిత్రం..దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి (ఫైల్‌ఫొటో)