తెలంగాణ

సత్తుపల్లి జిల్లా కోసం పోరాటం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 21: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి కేంద్రాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు నేతల హమీతో ఆందోళనలకు విరామం ఇచ్చిన ఆ ప్రాంత వాసులు ఈ నెల 22వ తేది నుండి ఆందోళనలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 22వ తేదిన సత్తుపల్లి బంద్‌కు పిలుపునివ్వటంతో పాటు 23న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.
సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలలోని 150గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు తమ పంచాయతీలలో చేసిన తీర్మానాలను శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వరరావు(అశ్వారావుపేట)లు ఇచ్చిన లేఖలు, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్‌లు ఇచ్చిన మద్దతు ప్రతాలు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సానుకూల పత్రాలను పంచాయతీల తీర్మానాలతో జత చేసి ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా సత్తుపల్లికి వచ్చిన సమయంలో జిల్లా కేంద్రంగా చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారని ఆ ప్రాంత వాసులు గుర్తుచేస్తున్నారు. తమ కంటే తక్కువ వైశాల్యం, జనాభా కలిగిన ప్రాంతాలను జిల్లాలుగా చేశారని, సత్తుపల్లిని కూడా జిల్లా కేంద్రంగా చేసేంతవరకు ఆందోళనలను చేస్తామని జేఏసీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత ఆయన చెప్పే సమాధానం తరువాత అవసరమైతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, జేఏసీలో అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలు ఉన్నాయని నేతలు తెలిపారు. ఉద్యమం నడిపే విధానం కేసీఆర్ నుండే నేర్చుకున్నామని, అదే పద్ధతిలో సత్తుపల్లి జిల్లాను సాధించుకుంటామని వారు వెల్లడించారు.