తెలంగాణ

అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వయంగా శాసనసభలో శుక్రవారం ఈ అంశంపై ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్వామా అమర జవాన్లకు సంతాపం తెలియచేస్తూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు. కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానానికి అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయి. అమరులకు సంతాపం తెలుపుతూ సభ రెండు నిమిషాలు వౌనం పాటించింది. సీఎం మాట్లాడుతూ, ఈ నెల 14 న కాశ్మీర్‌లోని పుల్వామా వద్ద సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడి భారత జాతిపై, భారత దేశంపై జరిపిన దాడిగా అభివర్ణించారు. 40 మంది జవాన్లు మరణించడం బాధాకరమన్నారు. ఈ దాడి హేయమైందన్నారు. భారత సైనికులకు యావత్ దేశం అండగా ఉంటుందన్నారు. సైనికులు ఒంటరిగా లేరని, వారికి అండగా దేశప్రజలంతా ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రతిపాదించిన తీర్మానాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టివిక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బలాలా, బీజేపీ సభ్యుడు రాజాసింగ్ మాట్లాడారు.