తెలంగాణ

తెరాసకు నాలుగు... ఎఐఎంకు ఒకటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: శాసనసభ్యుల కోటాలో జరుగబోయే శాసనమండలి సభ్యుల ఎన్నికలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం అభ్యర్థులను ప్రకటించారు. హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ నలుగురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసి మిగిలిన ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించారు. శాసనసమండలిలో ఎమ్మెల్యేల కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తోన్న ఐదుగురి సభ్యుల పదవీ కాలం మార్చి 29న తీరిపోనున్న విషయం తెలిసిందే. ఖాళీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేయగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎంపిక చేసిన అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. మార్చి 29న పదవీ కాలం తీరనున్న ఎమ్మెల్సీలలో టీఆర్‌ఎస్‌కు చెందిన హోం మంత్రి మహమూద్ అలీ, మహ్మద్ సలీం,
తిరువరగం సంతోష్‌కుమార్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. వీరిలో ముగ్గురు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు అయినప్పటికీ మహమూద్ అలీ ఒకరికే టీఆర్‌ఎస్ తిరిగి అవకాశం కల్పించి మిగతా ఇద్దరిని పక్కన పెట్టింది. మిగిలిన మూడు స్థానాలకు ఎంపిక చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం, ఖనిజావృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు. ఎగ్గే మల్లేశం కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్టు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అలాగే శేరి సుభాష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా గత ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా భవిష్యత్‌లో శేరి సుభాష్‌రెడ్డికి అవకాశం కల్పించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీకి సత్యవతి రాథోడ్ టికెట్ ఆశించగా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన నలుగురు అభ్యర్థులతో పాటు ఎంఐఎంకు కేటాయించిన ఐదవ సీటును కూడా గెలుచుకునే విధంగా వ్యూహరచన చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవాలంటే 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సభలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తే ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీకి సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వర్‌రావు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆయన ఓటు వేయకపోతే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందే అవకాశం లేదు. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి చెందిన సండ్ర వీరయ్య ఎంఐఎం అభ్యర్థికి ఓటు వేస్తే ఐదు స్థానాలు గెలుచుకుంటోంది. ఎంఐఎంకు కేటాయించిన ఐదవ ఎమ్మెల్సీ స్థానానికి జరుగబోయే ఎన్నిక కీలకంగా మారింది.