తెలంగాణ

డిప్యూటీ స్పీకర్ పదవికి నేడు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: డిప్యూటీ స్పీకర్ పదవికి శనివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. శాసనసభ సమావేశాల ముగింపు చివరి రోజు అయినా సోమవారం ఎన్నికను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. సభలో టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనప్రాయమే. మంత్రివర్గంలో చోటు దక్కని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి పద్మారావుగౌడ్‌ను ఈ పదవికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇలా ఉండగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రం టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, విపక్షాలు ఎంఐఎం, బీజేపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపింది. ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎం, బీజేపీలు అంగీకరించగా, కాంగ్రెస్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ తమ నిర్ణయాన్ని మాత్రం శనివారం వెల్లడిస్తామని చెప్పినట్టు టీఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ప్రభుత్వ చీఫ్ విఫ్, ముగ్గురు విప్‌ల ఖరారుపై కూడా కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ సమావేశాల్లోనే చీఫ్ విప్, విప్‌లను ఖరారు చేస్తుందా? లేక తర్వాత ఎంపిక చేస్తుందా? అనేది ఇంకా రూడీగా తెలియడం లేదు. మంత్రి పదవి ఆశించిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను చీఫ్ విప్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. చీఫ్ విప్ పదవికి వినయ్ భాస్కర్ సుముఖంగా లేనిపక్షంలో గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగడి సునీతను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇలా ఉండగా విప్‌లుగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.