తెలంగాణ

గోడ కూలి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, జూన్ 11: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో శనివారం పాడుబడిన దాబా గోడకూలి నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనలో జోర్‌పల్లికి చెందిన ఏడె రమాదేవి (17), గొట్టుముక్కులకు చెందిన నీరడి అఖిల (15) దుర్మరణం చెందగా, సంఘటనలో తీవ్రంగా గాయపడిన వెల్మల్ గ్రామానికి చెందిన ప్రవీణ్, సుదర్శన్‌లను ఆసుప్రతికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని పలుగు గుట్టపై జోర్‌పల్లికి చెందిన ఏడె చిన్నలింగన్న కుటుంబం సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఏడె లింగన్న కూతురు ఎడె రమాదేవి, పెద్ద కుమారుడు ప్రవీణ్, సమీప బంధువైన అఖిల కాలి నడకన స్వగ్రామానికి వెళ్లేందుకు నందిపేటకు బయలు దేరారు. అదే సమయంలో గాలివాన రావడంతో తలదాచుకునేందుకు మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న పాడుబడిన దాబా హోటల్ షెడ్డు కిందకు వెళ్లారు. అక్కడే వెల్మల్‌కు చెందిన సుదర్శన్ కూడా నిలబడ్డాడు. దాబా గోడ వర్షానికి తడిసిపోయి ఒక్కసారి ఈ నలుగురిపై కూలింది. ఆ సమయంలో ఇద్దరు బాలికలు కేకలు వేయగా, గమనించిన విజయ్‌నగర్‌కు చెందిన వాలి అక్కడకు వెళ్లి బాలికలను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో రమాదేవి, అఖిల అక్కడికక్కడే మృతి చెందగా, ప్రవీణ్, సుదర్శన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవీణ్, సుదర్శన్‌లు కూడా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ జాన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి, శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. మృతి చెందిన బాలికల్లో రమాదేవి స్థానిక శారద కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేయగా, గొట్టుముక్కులకు చెందిన అఖిల 9వ తరగతి పూర్తి చేసింది.
చిత్రం వర్షానికి కూలిపోయిన దాబా హోటల్, మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు