తెలంగాణ

ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత చారిత్రాత్మకం బండారు దత్తాత్రేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఓబీసీలకు ప్రధాని నరేంద్రమోదీ కమిషన్‌ను నియమించడం దానిని చట్టబద్ధం చేయడం చారిత్రాత్మకమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ జరిగిన ఓబీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఓబీసీ కమిషన్ ఫర్ కేటగిరైజేషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రోహిణీతో పాటు 175 మంది బీసీ నాయకులు, మేధావులు, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రోహిణి మాట్లాడుతూ సమాజంలో సుమారు ఐదు వేల బీసీ కులాలు అన్నింటికీ న్యాయం జరగాలంటే వర్గీకరణతో మేలు జరుగుతుందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన న్యాయం, సామాజిక న్యాయం జరగాలని అన్నారు. రాజ్యాంగం అప్పుడు ఎస్సీ, ఎస్టీలకు రాజకీయాల్లో చట్టబద్ధత కల్పించిందని, ఆనాడు బీసీలు లేరని అన్నారు. బీసీలు అంతా ఐక్యంగా ఉండి రాజకీయ చట్టబద్ధత కల్పించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ దేశంలో వేలాది బీసీలున్న విషయంలో వర్గీకరణకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కమిషన్ వేయడం, ఎంతగానో పేద వర్గాల బీసీలకు న్యాయం జరుగుతుందని , ఇది మొదటిసారి ప్రధానిగారు వేయడం ఎంతో ముదావహమని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ 70 ఏళ్లలో బీసీలకు ప్రధాని మోదీలా పనిచేసిన వారు ఎవరూ లేరని అన్నారు.
పేదవర్గాలవారైన ఈబీసీలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ధైర్యం మోదీతోనే సాధ్యమైందని అన్నారు. సమావేశంలో కాలప్ప, సూర్యారావు, ఎంబీసీ నేతలు , చట్టబద్ధమైన బీసీలకు రాజకీయ రాజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. మృణాళిని, కాటం నరసింహ యాదవ్ తదితరులు మాట్లాడారు.