తెలంగాణ

మంత్రి పదవులు సీఎం ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: మంత్రిమండలిలోకి ఎవరిని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ‘ఆ మాటకొస్తే నేనైనా, హరీశ్‌రావైనా ఇంకేవరైనా సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే’నన్నారు. శనివారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ముచ్చటించారు. శాసనసభ సీట్లలో 15 శాతానికి మించి మంత్రి పదవులు ఉండాలనే నిబంధనను సవరించి మరికొంత శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ అభ్యర్థులను తాము ముందుగా ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. శాసనసభ కాలపరిమితి తీరకముందే రద్దు చేయడం వల్లనే అప్పుడు అభ్యర్థులను కూడా ముందుగా ప్రకటించాల్సి వచ్చిందన్నారు. పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నది తమ పార్టీ అధినేత కేసీఆరే ఎంపిక చేస్తారన్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం ఉండటం వల్లనే ఒంటరిగా పోటీ చేసి గెలిచామన్నారు. ప్రధాని మోదీకి తిరిగి గెలుస్తామన్న విశ్వాసం లేకనే ఇతర పార్టీలతో పొత్తులకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వందకు వందశాతం చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. మాములు ఓటమి కూడా కాదు దారుణంగా ఓడిపోబోతున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకే నష్టమన్నారు. పక్క పార్టీలపై ఏడవకుండా రాష్ట్రానికి ఏం చేశావో చెప్పి చంద్రబాబు ఓట్లు అడిగితే బాగుంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు వైఫల్యం చెందరన్నారు. జన్మభూమి కమిటీలతో ఆయన ప్రజలను వేదించుకు తింటున్నరన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేసిందంటారు, మరోవైపు దేశంలోనే ఏపీ నంబర్ వన్ అంటారన్నారు. అన్యాయం చేస్తే నంబర్ వన్ ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. అమరావతిలో చక్రం తిప్పలేని చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఏమి తిప్పుతారని ఏద్దేవా చేశారు. ఏపీకి వ్యతిరేకంగా తాము ఏ ఒక్క పని చేయనప్పుడు ఎంత రెచ్చగొట్టినా ప్రజలెందుకు పట్టించుకుంటారని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నారన్నారు. ఆయనలో ఓడిపోతానన్న నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా గెలుపు సాధ్యం కాదన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి, మా ఎంపీలపై కూడా ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఏపీ పారిశ్రామికవేత్తలపై దాడులు జరిగితే వారికంటే చంద్రబాబే ఎక్కువ బాధ పడుతున్నారు, బహుశా వారిలో ఆయన బినామీలు ఉండి ఉంటారన్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఐదు సీట్లను గెలుచుకునేంతటి సంఖ్యాబలం తమకు ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోదీగా ఉండవన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 48 సీట్లు మాత్రమే గెలుచుకుందన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీకి వంద సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. బీజేపీకి కూడా ఇప్పటి కంటే సీట్లు తగ్గబోతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలుగా మారిపోయాయని విమర్శించారు. ఢిల్లీని శాసించాలంటే 16 సీట్లను గెలిపించాలన్నదే పార్లమెంట్ ఎన్నికల్లో తమ నినాదమన్నారు. రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించిన తమకు 16 సీట్లు గెలిస్తే కేంద్రాన్ని శాసించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని కేటీఆర్ అన్నారు.