తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 27: రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 726 ఓట్లకుగాను 692 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మంలో 326కు 321, కొత్తగూడెంలో 226కు 199, పాల్వంచలో 115కు 113, భద్రాచలంలో 59కి 59 ఓట్లు పోలయ్యాయి. గత కొన్ని రోజులుగా ఏర్పాటు చేసిన క్యాంప్‌ల నుంచి తమ ఓటర్లను ఆయా రాజకీయ పార్టీలు నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. శాసనసభ్యులు, ఆయా పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు వెన్నంటి ఉండి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకరావడం గమనార్హం. పోలింగ్ ప్రక్రియలో ఆయా నేతలు అనుకున్నట్లు జరిగినట్లు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగిందని అందరు ఆందోళన చెందడం గమనార్హం. అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్, తెలుగుదేశం మద్దతుతో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజులతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. నామినేషన్ వేసేటప్పుడు స్వతంత్రులకు ఉన్న ప్రాధాన్యత ఎన్నిక సమయంలో లేకపోవడం గమనార్హం. కాగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలపై సిపిఎంకు చెందిన ఐదుగురు, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందిన ఇద్దరిని ఆ పార్టీలు పార్టీ నుంచి సస్పెండ్ చేశాయి.

పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు బాలసాని, పువ్వాడ, లింగాల