తెలంగాణ

రాష్ట్రంలో 900 సొసైటీల ద్వారా విత్తనాల సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమాన్‌పూర్, జూన్ 11: రాష్ట్రంలోని రైతులకు 900 సొసైటీల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో వివిధ రకాల విత్తనాలను పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో శనివారం సింగిల్ విండో చైర్మన్ బాద్రపు మల్లేష్ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఎంపిపి ఇనగంటి ప్రేమలత, జడ్పీటిసి మేకల సంపత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోని రైతుల లెక్కలను తూచా తప్పకుండా చేయాలని వ్యవసాయ అధికారి ప్రమోద్ కుమార్‌ను కోరారు. విత్తనాలను ఒకేచోట కాకుండా ప్రతీ గ్రామంలో పర్మిట్ రాసి అవసరమైన విత్తనాలను అక్కడే రైతులకు పంచాలని సూచించారు. వివిధ గ్రామాల్లో తేదీల వారిగా ముందే రైతులకు తెలియపరచాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో 127 సొసైటీల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులను పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులు తమ పట్టాదారు పాసు బుక్కుల ప్రకారం విత్తనాలు తీసుకోవాలని, ఈ ఖరీఫ్ సీజన్‌లో విత్తనాల కొరత లేకుండా చేస్తామని అన్నారు. ఒకవేళ కొరత ఉంటే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల నుంచి వివిధ రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే సొసైటీలకు లాభ దాయకంగా మారుతుందని స్పష్టం చేశారు.