తెలంగాణ

పంచాయతీలకు జవాబుదారీతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: పంచాయతీలకు స్థానిక సంస్థలకు జవాబుదారీతనం తెస్తామని గ్రామాలను అద్దంలా మారుస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ్ధర్‌బాబుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శ్రీ్ధర్‌బాబు మాట్లాడుతూ బడ్జెట్‌లో పంచాయతీలకు నిధుల ప్రస్తావన లేదని, కాంగ్రెస్ పార్టీ వల్లే 24 గంటల కరెంట్ సాధ్యమైందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీల్లో అరాజకం సృష్టిస్తోందని పేర్కొన్నారు. శ్రీ్ధర్‌బాబు వ్యాఖ్యలపై సీఎం స్పందించారు. శ్రీ్ధర్‌బాబు సభను, ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు 40వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, అద్దాల్లాంటి గ్రామాలు తయారుచేసి చూపిస్తామని కేసీఆర్ ఉద్ఘాటించారని అన్నారు. గ్రామాల్లో పన్నులు వసూలు చేయిస్తామని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వంద శాతం వసూలు చేయిస్తామని అన్నారు. మంచినీళ్లు ఇస్తామని, పంచాయతీరాజ్ యాక్టు చదివితే అర్ధం అలవుతుందని శ్రీ్ధర్‌బాబుకు సీఎం సూచించారు. 40 నెలల్లో కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను నిర్మించామని, తమ ప్రభుత్వ హయాంలో 3600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అన్నారు. ఇవద్యుత్ తలసరి వినియోగంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని వెల్లడించారు. పంచాయతీలను పటిష్టం చేసేందుకే కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చామని అన్నారు. అరాజక వ్యవస్థకు అంతం పలికి, ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా చేస్తామని సీఎం తేల్చిచెప్పారు. పంచాయతీల బకాయిలు అన్నీ ఆనాటివేనని, విద్యుత్ సంస్థలు బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ నిలిపివేస్తామని చెబుతున్నాయని, ఈ క్రమంలో తాము బకాయిలను ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయమని ప్రధాన కార్యదర్శిని, ఆర్ధిక శాఖ కార్యదర్శిని కోరానని చెప్పారు.