తెలంగాణ

హద్దు మీరి అప్పులు చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాష్ట్రాల పట్ల నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నాయని, కేంద్రం ధోరణి మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. శనివారం నాడు శాసనసభలో బడ్జెట్‌పద్దులపై జరుగుతున్న చర్చలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ప్రస్తావనకు వచ్చినపుడు సీఎం జోక్యం చేసుకుంటూ అప్పు చేసేది అభివృద్ధికేనని గుర్తించాలని, పాత కాలం చింతకాయ పచ్చడి మాదిరి కాంగ్రెస్ నేత శ్రీ్ధర్‌బాబు మాట్లాడారని దేశంలో ఆలోచనల్లోనూ, ధోరణిలోనూ గుణాత్మక మార్పు రావాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎఆర్‌బీఎం హద్దు మీరి అప్పులు చేయలేదని, అలాగే అప్పులపై సక్రమంగా సకాలంలో వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. ఈ అంశంపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు. నిబంధనలకు లోబడే అప్పులు చేశామని, మళ్లీ అప్పు చేస్తామని, దానిని తీరుస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఊళ్లలో ఉండే అప్పుల వాడి మాదిరే ఆర్‌బీఐ కూడా అనేక అంశాలను చూసి రాష్ట్రాలకు, సంస్థలకు అప్పులు సమకూరుస్తుందని, మన రాష్ట్రానికి ఉన్న ‘పతేరా’ చూసే అప్పులు ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేసే అప్పు ప్రైవేటు అప్పు కాదని, ఇటీవల ప్రభుత్వం ఏర్పడిన ఆరు రోజుల్లోనే 15వేల కోట్లు ఇస్తామంటూ కొన్ని కార్పోరేషన్లు ముందుకు వచ్చాయని, ఆ నిధులను కూడా సమకూర్చుకుంటామని అన్నారు. రానురాను అభివృద్ధి- ప్రజల జీవిక ప్రాధాన్యతలు పోయి, రాజకీయ ప్రాధాన్యతలు పెరిగిపోయాయని, కొన్ని సబ్జెక్టులను పూర్తిగా రాష్ట్రాలకు విడిచిపెట్టిన కేంద్రం, కొన్నింటిని తన వద్ద పెట్టుకుందని, కొన్ని సబ్జెక్టులను ఉభయ జాబితాలో పెట్టిందని, ఒక కుగ్రామంలో ఉన్న స్కూలు గురించి, ఆస్పత్రి గురించి కూడా కేంద్రంపై ఆధారపడేలా చేశారని ఈ విధానం మారాలని తాను ప్రధానితో చెప్పడమేగాక, ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆర్ధిక సంఘం ముందు వాదన వినిపించానని అన్నారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధులను గతంలో సకాలంలో ఇచ్చేదని, ఇపుడు కొంత జాప్యం చేస్తోందని, దీనివల్ల కూడా రాష్ట్రాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం తన అధికారాలను కేంద్రీకృతం చేసిందని, కేంద్రం మొద్దు నిద్ర వీడి ఆధునిక దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. కేంద్ర రిజర్వు బ్యాంకు వద్ద 13 లక్షల కోట్లు మూలుగుతున్నాయని, అంత డబ్బు రిజర్వు చేసుకోవల్సిన పనే్లదని, చైనా, జపాన్‌లు మన కంటే తక్కువ జీఎస్‌డీపీ ఉన్నా ఎంతో అభివృద్ధి చెందాయని, మన రాష్ట్రం 2028 నాటికి 30 లక్షల కోట్లు వెచ్చించే సామర్ధ్యంతో ఉంటుందని ఈ తరహా దూరదృష్టి పరిపాలకులకు ఉండాలని అన్నారు. 2004లో జలవనరుల ట్రిబ్యునల్ ఏర్పాటైందని, మిగులు జలాలకు సంబంధించి వివాదాలపై కేంద్రానికి లేఖరాస్తే దానిని కేంద్రం ట్రబ్యునల్‌కు పంపుతుందని, తెలంగాణ జలవనరుల వివాదాలు పరిష్కరించమని ప్రధానికి వంద లేఖలు అందజేసినా, నేటికీ ఆలేఖలను ట్రిబ్యునల్‌కు పంపలేదని, గత పదేళ్లుగా ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ట్రిబ్యునల్ సైతం లోతుగా అధ్యయనం చేయకుండా స్టేలు మంజూరు చేస్తారని, దీని వల్ల రాష్ట్రాలకు ఎంత నష్టమో అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యంత ధనిక దేశం అమెరికా అని, అలాగే అత్యంత అప్పులున్న దేశం కూడా అమెరికా అని గుర్తించాలని, అమెరికాకు తెలివి లేకుండానే ఇన్ని అప్పులు చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం నియంతృత్వం వీడాలని పేర్కొన్నారు.