తెలంగాణ

సత్ఫలితాలిచ్చిన ‘సౌభాగ్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సౌభాగ్య పథకం ఇంటింటికీ విద్యుత్ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పరిధిలో విజయవంతం అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ వందకు వంద శాతం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అమలు చేయడం పట్ల ప్రశంసించారు. ఈ సందర్భంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ అధికారులకు అవార్డులను మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు సైతం అవార్డులు అందుకున్నారు. ఇంధన శాఖ చీఫ్ సెక్రటరీ అజయ్‌విశ్రా, విద్యుత్ అధికారులు శ్రీనివాస్, అనితాదేవీ, పరశురాముడు, శ్రీనివాస్‌రావు. రాజేంద్రప్రసాద్, జగదీష్ అవార్డులు అందుకున్నారు.

చిత్రం.. ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ నుంచి అవార్డులు అందుకుంటున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు