తెలంగాణ

అమిత్ షా ప్రకటన హాస్యాస్పదం: చాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 90 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటన హాస్యాస్పదమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బిజెపి ప్రకటనను తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తోసిపుచ్చుతూ తెలంగాణకు అందిన సహాయాన్ని అంకెలతో వివరించడాన్ని హర్షిస్తున్నామని ఆయన తెలిపారు. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సులననుసరించి ఆయా రాష్ట్రాల జనాభా ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులను అందిస్తుందన్నారు. బిజెపి జాతీయ నేత అమిత్ షా రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే రీతిలో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కరువు తీవ్రంగా ఉందని అందుకు రూ. 3064 కోట్లు ఇవ్వాలని కోరితే, కేవలం రూ. 712 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైనందున అమిత్‌షా మొదలు ప్రభుత్వ సమర్థకులందరూ అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రకటనలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బిజెపి పాలకులు పత్రికా ప్రకటనలతో మోసం చేస్తున్నారని ఆయన నిశితంగా విమర్శించారు.