తెలంగాణ

ప్రభుత్వం ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘పోలీసు ఇన్‌ఫార్మర్ల’ పేరుతో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన కుటుంబాలు అల్లల్లాడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 80 కుటుంబాలు హైకోర్టుకు వెళ్లాయి. వీరిలో సుమారు 30 కుటుంబాలకు చెందిన కేసుల్లో తీర్పు చెబుతూ, ఒక్కో కుటుంబంలో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వారికి ఉద్యోగం లభించింది. మరో 50 మంది వరకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. వీరు కోర్టుకు వెళ్లడమే కాకుండా, కోర్టు వెలుపల ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగం పొందాలని కూడా ప్రయత్నిస్తున్నారు. నక్సలైట్ల చేతుల్లో హత్యకు గురైన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కాంగ్రెస్ హయాంలో 504 పేరుతో ఒక జీఓ జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ జీఓ అమల్లో లేదు. దాంతో న్యాయం జరగని కుటుంబాలు సర్కారు కరుణకోసం ఎదురు చూస్తున్నాయి. తమ కుటుంబాల్లో ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే కోర్టులో ఉన్న కేసులను విరమించుకునేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ కరుణ కోసం ఎదురు చూస్తున్న వారు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్‌పిల చుట్టూ తిరుతుగుతున్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని సతీష్‌కుమార్, జైపాల్, సుధీర్‌గౌడ్ తదితరులు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. సచివాలయంలో సంబంధిత అధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు.