తెలంగాణ

అంటువ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: ఈనెల 17వ తేదీ నుంచి 23వరకు సీజనల్ వ్యాధుల నివారణ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు వస్తాయని అప్రమత్తంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలపై దృష్టిసారించాలని సూచించారు. ఆదిలాబాద్, భద్రాచలం, నల్లమల, ఏటూరునాగారం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల వల్ల ప్రాణాపాయం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు అవసరం అని సూచించారు. ఆదివాసీ, గిరిజనుల్లో చైతన్యం తీసుకురావాలని, ఏజెన్సీ ప్రాంతాలకు అవసరం అయిన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఒక్క వైద్య శాఖ అంతా చేయలేదని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పని చేయాలని చెప్పారు. ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయితీరాజ్, రూరల్ వాటర్ సప్లై వంటి శాఖలు, వివిధ విభాగాలతో కలిసి పని చేయాలని, ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ తివారీ, డాక్టర్ లలిత కుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.