తెలంగాణ

అవినీతిపరులకు కేంద్రం అండ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 13: అవినీతి రహిత పాలన అందిస్తామని, స్విస్ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనాన్ని తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తామని హామీలిచ్చిన మోదీ అధికారంలోకి రాగానే అందుకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఘాటుగా విర్శించారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ముంచిన విజయ్ మాల్యా లాంటి అవినీతి పరులకు కేంద్ర ప్రభుత్వం అండదండలు అందిస్తుందని ఆరోపించారు. బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైందని దుయ్యబట్టారు. సోమవారం సంగారెడ్డి ఐబి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై ఎండగట్టారు. 9 వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన మాల్యాకున్నా 14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేయకుండా కేంద్రం మోకాలడ్డుతుందన్నారు. ఇంతటి భారీ లూటీ జరిగినా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వౌనంగా ఉండటంలో ఆంతర్యమేమిటో స్పష్టం చేయాలని చాడా డిమాండ్ చేసారు. వ్యాపం కుంభకోణంలో 53 మందిని బలిగొన్నా ఇప్పటి వరకు ఎవరు చంపారో తేల్చలేని నిద్రాస్థలో కేంద్రం ఉందన్నారు. కరవు కోరల్లో చిక్కిన రాష్ట్రానికి కేంద్రం ప్రజలు చెల్లించిన పన్నులనే సహాయంగా అందించే తప్ప పెద్దగా ఆదుకున్నది ఏమిలేదని కేంద్రాన్ని విమర్శించారు. బంగారు తెలంగాణ అంటున్న సిఎం కెసిఆర్ ఫాంహౌస్‌లో ఎక్కువ సెక్రటేరియెట్‌కు తక్కువగా ఉందని, ఇలాంటి పరిపాలన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. సిఎం పర్యటనలకు బందోబస్తుల పేరిట భారీగా ఖర్చు చేస్తున్నారని, అంతటి సెక్యూరిటీ అవసరమా అని ప్రశ్నించారు. ఐదు రోజుల పాటు తన వ్యవసాయ క్షేత్రం వద్ద నిర్వహించిన అయుత చండీ మహాయాగానికి చేసిన ఖర్చు ఎంతో ఆ నిధులు ఎక్కడవివో శే్వతప్రతాన్ని విడుదల చేయాలని సిఎంను డిమాండ్ చేసారు.