తెలంగాణ

కల్తీనూనె తయారీ కేంద్రం సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, జూన్ 13: కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కల్తీనూనె తయారీ కేంద్రాన్ని అధికారులు సోమవారం సీజ్ చేశారు. సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్ ఆదేశాల మేరకు తహసీల్దార్ దార ప్రసాద్, ఎంపిడివో వంగ సురేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి తరలివెళ్లి నూనె కేంద్రాన్ని సీజ్ చేశారు. గత కొంత కాలంగా దమ్మన్నపేట పరిసర ప్రాంతంలో వ్యర్థ పదార్థాలతో కల్తీనూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారన్న విషయాన్ని ‘ఆంధ్రభూమి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో అధికారులు కల్తీనూనె తయారీ కేంద్రంపై మెరుపు దాడులు నిర్వహించారు. నిల్వచేసిన పదార్థాల శాంపిళ్లను పరీక్ష నిమిత్తం ఫోరెనిక్స్ ల్యాబ్‌కు తరలించారు. అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు అధికారులు ఆ కేంద్రాన్ని సీజ్ చేశారు. కల్తీనూనె తయారు చేస్తున్న కేంద్రానికి ఎలాంటి తలుపులు లేకపోగా, కేంద్రానికి ఉపయోగిస్తున్న జనరేటర్‌ను సీజ్‌చేసి జనరేటర్‌కు సంబంధించిన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అధికారుల ఆదేశాలమేరకు కేంద్రాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. తదుపరి ఆదేశాలమేరకు నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆధికారుల వెంబడి ఆర్‌ఐలు కార్తీక్, విజయలక్ష్మి, విఆర్వోలు పాల్గొన్నారు.